Nellore: బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనంగా 'తిరంగా ర్యాలీ': హోరెత్తిన దేశభక్తి నినాదాలు!
Nellore: నెల్లూరు విఆర్సీ కూడలి నుంచి నగర వీధుల్లో భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
Nellore: బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనంగా 'తిరంగా ర్యాలీ': హోరెత్తిన దేశభక్తి నినాదాలు!
నెల్లూరు: నెల్లూరు విఆర్సీ కూడలి నుండి నెల్లూరు నగరవీధుల్లో ,దేశ స్వాభిమానాన్ని, సమగ్రతను పెంపొందించే విధంగా దేశభక్తిని నగర ప్రజలకు చాటే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత మువ్వన్నెల జెండాతో "తిరంగా ర్యాలీ" భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా యువమోర్చా అధ్యక్షులు భరత్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక మునుపు కేవలం స్వాతంత్ర్య దినోత్సవరోజు మొక్కుబడిగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి కార్యక్రమాన్ని ముగించుకునేవారు. కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత అందుకు పూర్తి భిన్నంగా ప్రతి పౌరుని గుండెల్లో దేశభక్తి పెంపొందించాలని, సమాజంలో దేశభక్తిపై ఒక అవగాహన మరియు స్వాభిమాన వాతావరణాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం పేరుతో ప్రతి సాధారణ పౌరుని ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటే విధంగా పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం సమాజంలో దేశం పట్ల భక్తి భావాన్ని పెంపొందించడానికి ఎంతగా ఉపయోగపడిందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అని కొనియాడారు. జోనల్ కన్వీనర్ శివారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సాధనకై ఎందరో మహనీయులు చేసిన త్యాగాన్ని బలిదానాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు గుత్తా అశోక్ నాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం అంటే ప్రభుత్వ కార్యాలయాలకు, అధికారులకు పరిమితమై కార్యాలయాల కాంపౌండ్ లో ముగిసిపోయే విధంగా మోడీ గారి ప్రభుత్వానికి ముందు జరిగిందని కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిందని, స్వాతంత్ర దినోత్సవం అంటే ప్రతి పౌరుడు చాతీ విరుచుకొని జాతీయ జెండా చేపట్టి గర్వంగా దేశభక్తి చాటే విధంగా సమాజంలో ఒక మార్పు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు అన్నిమోర్చ నాయకులు , మహిళలు ,విద్యార్థులు కార్యక్రమం లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




