Nellore: నెల్లూరులో ఘనంగా 'బ్లూ స్కై స్టూడియో' ప్రారంభం!
Nellore: నెల్లూరు బాలాజీ నగర్‌లో బ్లూ స్కై స్టూడియో ఘనంగా ప్రారంభమైంది.
Nellore: నెల్లూరులో ఘనంగా 'బ్లూ స్కై స్టూడియో' ప్రారంభం!
Nellore: " బ్లూ స్కై ద్వారా ఆకాశానికి ఎదగండి :-- అధినేత ముక్కు రాధా కృష్ణ గౌడ్
నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ మొదటి మెయిన్ రోడ్డు లో "బ్లూ స్కై స్టూడియో" సోమవారం ఉదయం 11 గంటలకు ఘనంగా ప్రారంభోత్సవం జరిగినది.
ఈ సందర్భంగా బ్లూ స్కై స్టూడియో అధినేతలు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..
బ్లూ స్కై స్టూడియో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం ఆనందాన్నిచ్చిందని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖులతో పాటు హైదరాబాదు నుండి ప్రముఖులు రావడం సంతోషమని, ఆకాశమే హద్దుగా తమ సంస్థ ద్వారా కళాకారులు ఎదగాలని, అలాగే తమ సంస్థ లక్ష్యం, చిట్టచివర నిరుపేద, మధ్యతరగతి ప్రజల నుంచి, ఉత్సాహవంతులైన ఆయా రంగాల పట్ల అభిరుచి కలిగిన, యువతీ యువకులను ఆహ్వానించి, వారి కళలను ఆకాంక్షలను సార్థకం చేసుకునే విధంగా.. వారికి లక్ష్యాలను నిర్దేశించి, వాటికి అనుగుణంగా శిక్షణను ఇస్తామని, తద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్నటువంటి రంగాలను పై వర్గాల వారికి అందుబాటులోకి తెస్తూ... డాన్స్, యాక్టింగ్, మోడలింగ్, తదితర రంగాలలో అత్యున్నత స్థాయికి చేరే విధంగా వారి వారి కళలను నిజం చేస్తామని క్రమశిక్షణ క్రమశిక్షణతో కూడినటువంటి నైతిక విలువలతో కూడిన శిక్షణను అందిస్తామని, ఆయా రంగాలలోని ప్రముఖులతో మెలకువలను నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దుతామని అన్నారు.
మెట్రోపాలిటన్ సిటీ లకు దీటుగా ట్రైనింగ్ ఇచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నటీనటులను డాన్సర్స్ ను వివిధ యాక్టింగ్ కళాకారులను తయారు చేస్తామని అలాగే తమ సంస్థ ద్వారా డాన్స్, యాక్టింగ్, మోడలింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫిట్నెస్, జుంబా, అడ్వెంచర్స్ వెడ్డింగ్ ప్లానర్స్ సర్వీసులను అందిస్తామని అందరికీ అందుబాటులో ఉండే ధరలతోనే మంచి ప్రమాణాలు కలిగిన వ్యవస్థను అందిస్తామని చెప్పారు.
అనంతరం ముఖ్య అతిథి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ...
నేడు సమాజంలో కళారంగం పట్ల అభిరుచి అభిలాష ఎక్కువైందని, వయస్సు, ఆశ, ప్రాంతం , పేద, ధనిక, తారతమ్యాలు అంతం అవుతున్నాయని, ఇది కలల ద్వారానే సాధ్యమవుతుందని, కావున నెల్లూరు నగరానికి తలమానికంగా బాలాజీ నగర్ నడిబొడ్డున "బ్లూ స్కై స్టూడియో" ఏర్పాటు చేయడం గర్వకారణం అని తను చిన్నతనం నుంచి డాన్స్ అన్న ఇతర నృత్యాలు అన్న, చిన్న చూపుగా చూసే వాడినని, అవహేళన చేసేవాడిని, అలాంటిది తానే చిన్నపిల్లాడినై తన కుమారుడి వివాహ మహోత్సవ సందర్భంగా జరిగిన సంఘీత్ లో తన ఆరాధ్యదైవం సినీ నటుడు బాలకృష్ణ సినిమాలలోని పాటలకు నృత్యం చేయడం, జీవితంలో గుర్తుండే పోయే సంఘటనని నెమరు వేసుకున్నారు...
అలాగే తాను ఇకనుంచి తీరిక సమయాలలో తప్పకుండా బ్లూ స్కై డాన్స్ స్టూడియోకి వచ్చి వివిధ నృత్యాలను నేర్చుకుంటానని, అలాగే జిల్లాలోని డాన్స్ అభిమానులు కళ ప్రియులు ఈ అవకాశాలను వినియోగించుకొని, ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు...
అనంతరం ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ నందు మాస్టర్ మాట్లాడుతూ...
నేడు డాన్స్ కళ సినిమా రంగానికే కాకుండా, అన్ని శుభ అశుభ కార్యాలకు సీరియల్స్ కు, క్రీడా, శాస్త్ర, సాంస్కృతిక కార్యక్రమాలకు, వివిధ రకాల రాజకీయ సేవ వ్యాపార ఉద్యోగ రంగాలలో సైతం ఆటపాటలకు ప్రాధాన్యత పెరిగిందని, అలాగే మోడలింగ్ యాక్టింగ్ పట్ల ప్రజలలో అవేర్నస్ పెరిగిందని, ప్రతి ఒక్కరికి వారి వారి టాలెంట్ కి దగ్గర అవకాశాలు మెండుగా ఉన్నాయని కావున అందరూ పై రంగాల పట్ల అభిరుచిని పెంచుకొని, వాటిల్లో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి ఉన్నత స్థితికి ఎదగాలని కోరారు..
పై కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ రేణు ప్రియా, సీనియర్ కొరియోగ్రాఫర్స్ శామ్యూల్ మాస్టర్, రాజు మాస్టర్, శ్రీకాంత్ మాస్టర్, మధు మాస్టర్, తేజ, యోగానంద తదితరులు పాల్గొన్నారు.




