Nellore: నెల్లూరులో ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు!

Nellore: టీవీ కళ్యాణ సదన్‌లో బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు నిర్వహించి 15 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

A Praveen, Nellore
Published on: 7 Sept 2026 12:05 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు!

నెల్లూరు: భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో స్థానిక టీవీ కళ్యాణ సదన్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అధ్యాపకులు రంగస్థలం నటులు శ్రీ వల్ల కవి వెంకట సుబ్బారావు పంతులు గారికి కౌముది ప్రధానం చేశారు తదుపరి 15 మంది ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు కాలేజీ ఉపాధ్యాయు లకు సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు గుడ్లదొన వాసుదేవరావు మాట్లాడుతూ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ప్రపంచ మేధావి తత్వశాస్త్రవేత్త అని కొనియాడారు.

భారత తొలి తరం ఉపరాష్ట్రపతిగా సేవలందించారని అధ్యాపకులందరికీ ఆయన ఆదర్శప్రాయుడన్నారు ఆయన పేరుతో పలువురికి సన్మానించుకోవడం ద్వారా ఆయన ఆదర్శాలను అనుసరించడం అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దుద్దుకూరు రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శి మద్దులపల్లి శ్రీధర్, యువజన సంఘం అధ్యక్షుడు విష్ణుతేజ, మహిళ అధ్యక్షురాలు జయలక్ష్మి, కార్యదర్శి నాగలక్ష్మి, నాకు జ్యోతి ఛాయాదేవి, విజయలక్ష్మి, ప్రత్యూష పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story