Nellore: తల్లిపాలు బిడ్డకు రక్షణ కవచం: అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రాజేశ్వరి

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది.

Madhav Goud, Nellore
Published on: 7 Aug 2026 6:40 PM IST
Nellore
X

Nellore: తల్లిపాలు బిడ్డకు రక్షణ కవచం: అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రాజేశ్వరి

నెల్లూరు: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని అంగన్వాడీ సూపర్ వైజర్ రాజేశ్వరి తెలిపారు, నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం మెయిన్ సెంటర్ నందు తల్లి పాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు వారం రోజుల పాటు అంగన్వాడీ సూపర్ వైజర్లు రాజ్యలక్ష్మి , రాజేశ్వరి ఆధ్వర్యంలో అన్ని సెక్టర్ల ల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గర్భవంతులు, బాలింతలు, తీసుకోవలసిన పౌష్టి కాహారం స్టాల్ ను ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ కు తల్లి మురిపాలు శ్రేష్ఠ కరమని అన్నారు,మురిపాల వల్ల బిడ్డ లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు, బాలింతలు పౌష్టి కాహారం తీసుకోవాలని ఎక్కువగా ఆకు కూరలు తీసుకోవాలని తెలిపారు,ఈ కార్యక్రమం లో గర్భవంతులు, బాలింతలు, గ్రామస్తులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story