Nellore: 12వ పీఆర్సీ 30% ఐఆర్ కోసం రేపు నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన

Nellore: మర్రిపాడులో బీటీఏ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. 12వ పీఆర్సీ, పెండింగ్ డీఏల సాధన కోసం రేపు నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 13 July 2026 7:43 PM IST
Nellore
X

Nellore: 12వ పీఆర్సీ 30% ఐఆర్ కోసం రేపు నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండల పరిధిలోని పోలిరెడ్డిపల్లి, నందవరం, మర్రిపాడు క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలలో బహుజన టీచర్స్ అసోసియేషన్ (బిటిఏ) సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మణి సుబ్బు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పిఆర్సీ ,డిఏ బకాయిల ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాస ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వం పై ద్వజమెత్తారు.

సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు లో రేపు కలెక్టరేట్ వద్ద జరుగు నిరసన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ట్రెజరర్ రాజశేఖర్ మాట్లాడుతూ పిఆర్సీ గడువు ముగిసి రెండున్నర సంవత్సరాలు అయిన ఇంతవరకు కమీషన్ కూడా వేయకపోవడం,పెండింగ్‌లో ఉన్న మూడు డిఎ లు విడుదల చేయలేదని,మూడు సంవత్సరాల క్రితం పెట్టుకున్న సరెండర్‌ లీవులు క్రెడిట్ కాకపోవడం శోచనీయం అని అన్నారు.

మండల అధ్యక్షులు ఈ శ్రీనివాసులు మాట్లాడుతూ గత ఏడాది బదిలీయై ఇప్పటికీ రిలీవ్ కాకుండా ఉన్న ఉపాధ్యాయులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. మండల ప్రధాన కార్యదర్శి ఎం పి నరసింహులు మాట్లాడుతూ ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ వారికి సేవలు అందించడంలో నిత్యం మండల శాఖ కృషి చేస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మణి సుబ్బు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాస, మండల అధ్యక్షులు ఈ శ్రీనివాసులు,ప్రధాన కార్యదర్శి యం. పి నరసింహులు, ట్రెజరర్ పవన్ కుమార్ తదితరులు. తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story