Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ, తనిఖీలు

Nellore: బుచ్చిరెడ్డిపాలెంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, దాబాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 29 Aug 2026 11:30 PM IST
Nellore
X

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ, తనిఖీలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం పరిధిలో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు 29-08-2026 న హోటళ్లు, దాబాలు మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు మరియు FSSAI నిబంధనలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా పరిశుభ్రత ప్రమాణాలు సరిగా పాటించని 7 ఆహార సంస్థలకు నోటీసులు జారీ చేశారు.

అలాగే, ఆహార తయారీ ప్రదేశాల్లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం మరియు ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన 5 సంస్థలపై కేసులు నమోదు చేశారు.

తనిఖీల సమయంలో కొన్ని సంస్థల్లో గుర్తించిన కృత్రిమ రంగులు కలిపిన చికెన్, పాడైపోయిన చికెన్ , హాఫ్ బాయిల్డ్ చపాతి , పరోటాలను పాడై పోయిన కాలిఫ్లవర్ 5 కేజీలు మరియు వినియోగానికి అనర్హమైన ఇతర ఆహార పదార్థాలను ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ధ్వంసం చేసినారు.

పల్చటి పాలిథిన్ కవర్లలో వేడి వండిన పదార్ధాలు పోసి వినియోగదారులకు అమ్ముచున్నారు. అటువంటి పల్చని పాలిథిన్ కవర్లను వాడకూడదని 15 కేజీల ఆహార పదార్ధాలను కట్టిఉంచిన వాటిని ధ్వంసం చేసినారు. షాపు యజమానులకు 120 మైక్రాన్ల పై బడిన కవర్లను మాత్రమే వాడాలని సూచించారు.

ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా బుచ్చిరెడ్డిపాళెం లో హోటళ్లు, దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు ఇతర ఆహార సంస్థలపై ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఆహార వ్యాపారులు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ, నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగదారులకు అందించాలని సూచించారు.

1. ప్రతి షాపు నందు యఫ్ యస్ యస్ ఏ లైసెన్సు వ్యాపార సంస్థ నందు గోడకు ఉంచాలి.

2. స్టాల్, హోటల్ పరిసరాలు & వంట గది పరిశుభ్రంగా ఉండాలి, కిచెన్ ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి, బొద్దింకలు ఇతర క్రిమి కీటకాలు లేకుండా వారానికి ఒకసారి పేస్ట్ కంట్రోల్ వారితో క్లీన్ చేయించుకుని, సర్టిఫికెట్స్ తీసి ఫైలింగ్ చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధముగా ప్రతి సంవత్సరము వంట గదిని పూర్తిగా పెయింట్ చేయించుకొనవలసినదిగా ఆదేశించారు.

3. చట్నీ, కారం వంటివి ఫ్రిడ్జ్ లో పెట్టారాదు. ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకోవాలి.

4. పాడైపోయిన కాలీఫ్లవర్ వాడరాదు. రంగులు వాడరాదు. అజినమోటో వాడరాదు.

5. హోటల్ నందు డ్రింకింగ్ వాటర్ పరిశుభ్రంగా ఉండాలి ఆ పాత్రను ప్రతిరోజు శుభ్రపరుచుకోవాలి.

6. చపాతీ, పరోట ప్యాకెట్స్ బ్రాండెడ్ వి వాడాలి. ఆఫ్ బాయిల్ చేసి పెట్టరాదు. అప్పటికప్పుడు చేసి ఇవ్వాలి.

7. డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేయు ట్యాంక్స్ క్లీన్ చేసుకోవాలి.

8.రా మెటీరియల్ (కిరాణా సరుకులు వంటివి)లూస్ గా గాలిలో ఉంచకుండా, కంటైనర్ లో మూతతో ఉంచాలి.

9. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ -ఫిఫో - మొదట వచ్చిన స్టాకు ముందుగా అమ్మాలి.

10. ఫస్ట్ ఎక్సపైరి ఫస్ట్ అవుట్ - fefo - ఎక్స్పైరీ డేట్ అయిపోయే వస్తువులు ముందుగా అమ్మాలి.

11. ఫ్రిడ్జ్ పరిశుభ్రంగా ఉంచాలి వారానికి ఒక సారి డిఫ్రాస్ట్ చేయాలి.

12. వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టుకోవాలి.

13. బిరియాని, టమాటా రైస్, లెమన్ రైస్,పుదీనా రైస్, గోబీ వంటి వాటిలో రంగులు వాడరాదు.

14. వంట నూనె - రెండుసార్లకు మించి డీప్ ఫ్రై చేసి వాడరాదు. రి యుజ్డ్ కుకింగ్ ఆయిల్ (రుకో ) ని కొనేవారికి అమ్మి వేయాలి.

15. ఫుడ్ 60°c వేడిగా ఉండేలా ఎలక్ట్రిక్ పరికరాలు వాడాలి. చల్లబడిపోయిన ఆహారం అమ్మ రాదు.

16. ఆహారమును వడ్డించు వారు హెడ్ కాప్స్ , హ్యాండ్ గ్లవ్స్ , యాప్రాన్స్ ఉండాలి.

17. ఫుడ్ ట్రే నందు మరియు ఫుడ్ పైన కవర్ చేయుటకు న్యూస్ పేపర్ ను వాడరాదు, బటర్ పేపర్ మాత్రమే వాడవలెను.

18. తయారైన ఆహార పదార్ధాలను దుమ్ము దూళి పడునట్లు ఏవిధమైన గ్లాసు బాక్సు లేకుండా ఉంచరాదు.

ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ జి. వెంకటేశ్వర రావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు డా. డి. నీరజ యం. ప్రణుతి ఫ్లోరా పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story