Buchireddypalem: రూ. 4 కోట్లతో నూతన మున్సిపల్ భవనం ప్రారంభం!

Buchireddypalem: రూ.4 కోట్లతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Aug 2026 10:03 AM IST
Buchireddypalem
X

Buchireddypalem: రూ. 4 కోట్లతో నూతన మున్సిపల్ భవనం ప్రారంభం!

Buchireddypalem: బుచ్చిరెడ్డిపాళెం ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. రూ.4 కోట్లతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. మూడు అంతస్తులతో అత్యాధునిక వసతులతో కార్యాలయాన్ని నిర్మించారు. గత ప్రభుత్వంలో పునాదులకే పరిమితమైన భవనం.. కూటమి ప్రభుత్వంలో పూర్తయింది. గత రెండేళ్లలో మున్సిపాలిటీ పరిధిలో రూ.57.57 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు.మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశాం.

గత ప్రభుత్వంలో పునాదులకే పరిమితమైన కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. రెండేళ్లలో రూ.57.57 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లోనూ రూ.4 కోట్లతో మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించడం అభినందనీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధికి వీపీఆర్ ఫౌండేషన్ తరఫున కూడా సహకారం అందిస్తాం అని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వ ఆర్థిక అరాచకాలతో రాష్ట్రంపై భారీగా అప్పులు ఏర్పడ్డాయి. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీకి మున్సిపల్ శాఖ ద్వారా మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది అన్నారు మునిసిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story