Nellore: నాయుడుపేటలో పోలీసుల నిర్వాకం. నడిరోడ్డుపై ప్రయాణికుల అవస్థలు

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పోలీసుల తనిఖీలు ప్రయాణికులకు శాపంగా మారాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 April 2026 1:58 PM IST
Nellore
X

Nellore: నాయుడుపేటలో పోలీసుల నిర్వాకం. నడిరోడ్డుపై ప్రయాణికుల అవస్థలు.

నెల్లూరు: "తనిఖీల పేరుతో పోలీసుల నిర్లక్ష్యం.. అర్థరాత్రి ప్రయాణికుల ఇక్కట్లు"

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట లో ప్రైవేట్ వాహనాలు తనిఖీలుపేరుతో..అక్కడ పోలీస్ లు దూరప్రాంత ప్రయాణికులకు చుక్కలు చూపారు. బస్సులో లోపాల పేరుతో అర్ధరాత్రి. నాయుడు పేట సిఐ వాహనాన్ని ఆపేశారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయలేదు. దీంతో నెల్లూరు నుంచి బెంగుళూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులు నరకం అనుభవించారు.చిమ్మ చీకట్లు. చిన్న పిల్లలు.అర్ధరాత్రి అల్లాడిపోయారు. తనిఖీలు పేరుతో బస్సు ఆపిన పోలీసులు నిర్వాహకానికి అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారు ఝాము వరకు ప్రయాణికులు నడిరోడ్డుపై నరకం అనుభవించారు.

ప్రైవేట్ బస్సు యాజమాన్యంతో ఇటువంటి చర్చలు కూడా జరుపుకుండా ప్రయాణికులకు మరో ప్రత్యామ్యాయం ఏర్పాటు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది... రాత్రి 11:30 నుంచి 2 గంటల వరకు నడిరోడ్డు పైన చిన్న పిల్లలు, స్త్రీలు, వయోవృద్ధులు దిక్కుతోచని స్థితిలో నిలబడ్డారు.

తాము నేషనల్ ట్రావెల్స్ వారికి చెల్లించిన డబ్బుల తిరిగి ఇప్పించే ఏర్పాటు గాని, ప్రత్యామ్నాయంగా మరో బస్సు ఏర్పాటు చేయడంపై గాని పోలీసులు ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవడం పై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, తనిఖీల పేరుతో ప్రయాణికులను ఇబ్బందులు పెట్టకుండా, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story