Nellore: నెల్లూరు రూరల్‌లో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.1.55 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు PACS చైర్మన్ పముజుల ప్రదీప్, టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Nellore: నెల్లూరు రూరల్‌లో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని సౌత్ మోపూర్ మరియు మన్నవరపాడు గ్రామాలలో 1కోటి 55 లక్షల రూపాయల వ్యయంతో సీ.సీ. రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు గుండ్లపాలెం పి.ఎ.సి.ఎస్. సొసైటీ చైర్మన్ పముజుల ప్రదీప్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ, గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు... రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు..
అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి విజయాన్ని అందించాలని కోరారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఛైర్మెన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, మాజీ ఎంపీటీసీ రాపూరు చెంచమ్మ , తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లినేని వేణుగోపాల్, అల్లాబక్షు, వాకా వెంకటేశ్వరులు, మన్నవరపు భాస్కర్, అన్నం సుధాకర్ గౌడ్, గుంజి రవి, బండ్ల గోపాలయ్య, పన్నెం సునీల్, రాపూరు వెంకయ్య, రాపూరు రవి, పముజుల తేజేష్,6 శ్యామ్ కుమార్, అంతటి గోపి, బండి శీనయ్య, మేకల శివయ్య, వంగపూడి శివయ్య, బద్దిపూడి నాగేంద్ర అశోక్, వెంకటేశ్వర్ నాయుడు, ఎన్.రాజారావు, గంగయ్య, మురళి, రఘురామయ్య, వెంకటరమణమ్మ, సయ్యద్ బాబు, మస్తానయ్య మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




