Nellore: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన సిమెంట్ మిక్సర్ లారీ!
Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Nellore: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన సిమెంట్ మిక్సర్ లారీ!
నెల్లూరు: వరికుంటపాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో నాపరాళ్లతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన సిమెంట్ మిక్సర్ లారీ ఢీకొట్టింది. కడప నుంచి చీమకుర్తి వైపు వెళ్తున్న సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ అదుపుతప్పి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొనడంతో రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే అదృష్టవశాత్తూ ట్రాక్టర్, లారీ డ్రైవర్లు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రోడ్డుపై పడిపోయిన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు తీవ్ర కసరత్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.




