Atmakur: ఆత్మకూరులో చల్లా రవికుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరం

Atmakur: మాజీ ఉపసర్పంచ్ చల్లా రవికుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరులో భారీ మెగా రక్తదాన శిబిరం, ఆలయాల్లో 51 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 2 July 2026 5:02 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో చల్లా రవికుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరం

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ ఉపసర్పంచ్ పట్టణ సీనియర్ రాజకీయ నేత చల్లా.రవికుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి అభిమానులు సన్నిహితులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.. ఆత్మకూరులో భారీ మెగా రక్తదాన శిబిరం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మొదట పట్టణంలోని పోలేరమ్మ, వినాయక స్వామి దేవాలయలలో వారి రాజకీయ అభివృద్ధి, క్షేమాన్ని ఆకాంక్షిస్తూ 51 టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంచారు.

అనంతరం ఓందూరుగుంట ప్రాంతంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల రక్త సేకరణ విభాగం సహకారంతో భారీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.. ఈ శిబిరానికి వారి అభిమానులు భారీగా పాల్గొని రక్తాన్ని అందించారు..ఈ కార్యక్రమాలను చల్లా రవికుమార్ రెడ్డి అభిమానులు షరీఫ్, మాజీ వార్డ్ కౌన్సిలర్ గందెల్ల వేణు, మహీంద్రా, జస్వంత్, చందు, కళ్యాణ్, మనోహర్, చల్లా రవికుమార్ రెడ్డి అభిమానులు సన్నిహితులు తదితరులు భారీగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమాలు నిర్వాహకులు చల్లా రవికుమార్ రెడ్డి అభిమాని షరీఫ్ మాట్లాడుతూ మా అన్న చల్ల రవికుమార్ రెడ్డి జన్మదినం అంటే తమకు పండుగ లాంటిదని వారి క్షేమాన్ని కాంక్షిస్తూ దైవ ప్రార్థనలు,రక్తదాన శిబిరాలు నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందని వారు నిండు నూరేళ్లు సంతోషకరంగా ఉంటూ రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపారు.. సాదిక్ హుస్సేన్ మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో రక్త సేకరణ నిర్వహించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story