Nellore: ఏపీలో మత్స్యకారుల అకౌంట్లలో రూ.20 వేలు జమ.. లబ్ధిదారులు ఖుషీ!
Nellore: సీఎం చంద్రబాబు నాయుడు తుమ్మలపెంట సభలో ఉండగానే మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేల నగదు జమ అయింది.
Nellore: ఏపీలో మత్స్యకారుల అకౌంట్లలో రూ.20 వేలు జమ.. లబ్ధిదారులు ఖుషీ!
నెల్లూరు: సీఎం సభలో ఉండగానే మత్స్యకారుల సేవలో పథకం. నగదు ప్రభుత్వం జమ చేయడంతో... మత్స్యకారుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికింది. నెల్లూరు జిల్లా.. కావలి మండలం.. తుమ్మలపెంటలో నిర్వహించిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మత్స్యాకారుల సేవలో పథకం కింద మత్స్యకారులకు అండగా ఉండేందుకు రూ.20వేల చొప్పున ప్రభుత్వం సాయం చేస్తున్న విషయం తెలిసిందే.
సీఎం సభలో ఈవిషయం మాట్లాడుతుండగానే.. అర్హులకు నగదు జమైనట్లు మెసేజ్‌లు రావడంతో మత్స్యకారుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మత్స్యకారులు సీఎంకు చూపించి సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో 1,30,796 మందికి.. రూ. 261.50 కోట్లు జమ అయినట్లు తెలుస్తోంది.
Next Story




