Nellore: రాపూరు గుడ్ షెఫర్డ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఆటలు, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

Yellayya, Nellore
Published on: 14 Nov 2026 8:05 PM IST
Nellore
X

Nellore: రాపూరు గుడ్ షెఫర్డ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

నెల్లూరు జిల్లా: రాపూరులోని గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో నవంబర్ 14 బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం వివిధ రకాల ఆటల పోటీలు, క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, పోటీతత్వం పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ టీ. చిట్టిబాబు, ఫౌండర్ అండ్ కరస్పాండెంట్ రాచపూడి రాజారత్నం విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారుల నవ్వులతో, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. బాలల దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.

Yellayya, Nellore

Yellayya, Nellore