Chintoor: జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి ఏఎస్‌పీ, ఏపీవోలకు ఏపీయూడబ్ల్యూజే వినతి

Chintoor: విశాఖ-అల్లూరి జిల్లాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చింతూరు ఏఎస్‌పీ బొడ్డు హేమంత్ కుమార్‌కు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత.

RAJESH REDDY, CHINTOOR
Published on: 24 Aug 2026 2:34 PM IST
Chintoor
X

Chintoor: జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి ఏఎస్‌పీ, ఏపీవోలకు ఏపీయూడబ్ల్యూజే వినతి

చింతూరు: రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో సోమవారం చింతూరు ఏఎస్పి బొడ్డు హేమంత్ కుమార్ , ఐటిడిఏ ఏపీవో రామతులసికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాసినేని చంద్రశేఖర్ మాట్లాడుతూ మైనింగ్ మాఫియా ఆగడాలపై నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల విశాలాంధ్ర విలేఖరి గోవిందు పై దాడి ఘటనే దీనికి నిదర్శనమని అన్నారు.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని, దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చింతూరు డివిజన్ అధ్యక్షుడు ఎండి షౌఖత్ అలీ, కార్యదర్శి నీలపు రాజేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మసకపల్లి సత్తిబాబు, బెజ్జంకి శ్రీనివాసచారి, బెజ్జంకి ఈశ్వర చారి, యూనియన్ సభ్యులు బెజవాడ నాగేంద్ర కుమార్, బేడే సతీష్, షేక్ రియాజ్, కొడమంచిలి జీవన్ కుమార్, కాక సీతారామయ్య, షేక్ ఖాదర్, తమ్మినేడి రామారావు, సురేష్ చౌదరి, రాజు, గెడ్డం వెంకటేశ్వర్లు, నెల్లూరి రమేష్, షేక్ బాష, మాడి ముత్యాలరావు, బొర్రా రామారావు, పిడియాల మోహనరావు, వెంకన్న పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story