Nellore: పదో తరగతి ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థి అండ

Nellore: పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయం.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 16 Jun 2026 5:11 PM IST
Nellore
X

Nellore: పదో తరగతి ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థి అండ

Nellore: చుంచులూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 500 పైగా మార్కులు సాధించిన నాగరాజు పల్లి విక్రాంత్,కలువాయి సునీత, వల్లెపు నరేష్ లకు పాఠశాల పూర్వ విద్యార్థి, విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి పాపుదిప్పు రమణారెడ్డి ఒక్కొక్కరికి ఇరవై వేలు వంతున మొత్తం అరవై వేల రూపాయలు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో 500 పైన మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి 20000 రూపాయల వంతున నగదు ప్రోత్సహకాలు అందజేయడం అభినందనీయమని, విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసి వారిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

పాఠశాల పూర్వ విద్యార్థిగా రమణారెడ్డి పాఠశాల పట్ల చూపుతున్న అభిమానం, విద్యార్థుల భవిష్యత్తు పట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమని కొనియాడారు. దాత రమణారెడ్డి మాట్లాడుతూ విద్య జీవితానికి బలమైన పునాది అని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు.

భవిష్యత్తులో కూడా 500 పైన మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ ఒక్కొక్కరికీ ఇరవై వేలు వంతున ప్రోత్సాక నగదు బహుమతి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగపాలెం ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్, రాజుపాలెం ప్రధానోపాధ్యాయుడు వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు డి.వి.రమణయ్య, పెంచలరావు, బాలాజీ, మల్లికార్జున స్వామి, తిరుపాలు, రహీమ, ప్రసాద్, రాఘవేంద్ర, కలిశెట్టి రాజేంద్ర కుమార్, యలగాల శ్రీనివాసులు, గ్రామానికి చెందిన నాగరాజుపల్లి రాజా, కాకే సుబ్బారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story