Nellore: చుంచులూరులో పదవ తరగతి టాపర్లకు నగదు బహుమతులు!

Nellore: నెల్లూరు జిల్లా చుంచులూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.30 వేల నగదు బహుమతులు, మెమొంటోలు పంపిణీ చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 4 Aug 2026 11:39 PM IST
Nellore
X

Nellore: చుంచులూరులో పదవ తరగతి టాపర్లకు నగదు బహుమతులు!

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చుంచులూరు ఉన్నత పాఠశాల నందు గత సంవత్సరం జరిగిన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి ఐదు స్థానాలు స్థానాలు సాధించిన విక్రాంత్,సునీత,నరేష్,రామ్ చరణ్,ప్రసన్న కుమార్ లకు గ్రామానికి కీ.శే. వేమన ఓబయ్య,జయ రత్నమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు శ్యామ్ ప్రసాద్,సురేష్,కృష్ణ కిషోర్ లు పది వేలు,ఏడు వేలు,ఐదు వేలు,నాలుగు వేలా ఐదు వందలు,మూడు వేల ఐదు వందలు వంతున మొత్తం 30 వేల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతులు,మెమెంటోలు అందజేశారు.

పాఠశాల విద్యార్థులందరికీ రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య మాట్లాడుతూ గ్రామానికి చెందిన దాతలు ముందుకు వచ్చి విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని,దాతల ప్రోత్సాహంతో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో చదివి ఉన్నత స్థాయి కి ఎదగాలని అన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు,పోటీ తత్వాన్ని పెంచేందుకు దాతలు చేస్తున్న కృషిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారి జొన్నా సత్యనారాయణ,ఉపాధ్యాయులు వెంకట రమణయ్య,పెంచలరావు,మల్లికార్జున స్వామి,బాలాజీ,తిరుపాలు,రహీమ,ప్రసాద్,రాఘవేంద్ర,రాజేంద్రకుమార్,శ్రీనివాసులు,సునీత,సీ.ఆర్.ఎం టీ. కస్తూరయ్య,నాగరాజు పల్లిరాజా,గ్రామస్తులు, తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story