Vinjamuru: అక్రమ రియల్ ఎస్టేట్ దందాలపై సీఐటీయూ ఘాటు విమర్శలు!

Vinjamuru: ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని అక్రమ లేఔట్లపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జి. స్వర్ణకు సీఐటీయూ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 July 2026 11:10 PM IST
Vinjamuru
X

Vinjamuru: అక్రమ రియల్ ఎస్టేట్ దందాలపై సీఐటీయూ ఘాటు విమర్శలు!

వింజమూరు: వింజమూరు మండల పరిధిలో ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న ప్రాంతంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లేఔట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ జి. స్వర్ణకు వినతిపత్రం అందజేశారు.

సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, లేఔట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కూడా కొంతమంది ఆక్రమించి, ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్లాట్లుగా విభజించి క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత స్థలాలకు హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు.

నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు విక్రయించడం వల్ల రైతులు, కొనుగోలుదారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అక్రమ లేఔట్లను గుర్తించి వెంటనే నిలిపివేయడంతో పాటు, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే, ప్రజలు ప్రభుత్వ అనుమతులు పొందిన లేఔట్లలో మాత్రమే స్థలాలు కొనుగోలు చేసేలా అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story