Nellore: "క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని పరిశీలించిన నగర కమిషనర్"

Nellore: నగర కమిషనర్ వై.ఓ నందన్ మూలాపేటలోని పోలింగ్ బూత్‌లలో పర్యటించి, ఓటర్ల జాబితా (SIR) సవరణ ప్రక్రియను పరిశీలించారు.

V. Narasimhulu, Nellore
Published on: 18 Jun 2026 11:46 AM IST
Nellore
X

Nellore: "క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని పరిశీలించిన నగర కమిషనర్"

Nellore: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమ నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం మూలాపేట లోని వివిధ పోలింగ్ బూత్ ప్రాంతాలలో పర్యటించారు.

స్థానిక రామయ్య బడి ఎదురు వీధి, చాముండి వారి తోట, రాజా రామ్ మోహన్ రాయ్ పార్క్ ప్రాంతం తదితర 111, 112, 113, 114 పోలింగ్ బూత్ ల పరిధిలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రక్రియలో సూపర్వైజర్, బి.ఎల్.ఓ లు, బి.ఎల్.ఏ లతో కలిసి ఎన్యూమరేషన్ ఫారం లు నింపి ఎన్నికల ప్రక్రియలో కమిషనర్ స్వయంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓటర్లు అడిగిన వివిధ రకాల సందేహాలకు కమిషనర్ సమగ్రంగా సమాధానాలను వివరించి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సిహెచ్.రవి, బి.ఎల్.ఓ లు, బి.ఎల్.ఏ లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story