Kanigiri: కనిగిరిలో హెచ్‌ఎమ్‌టీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయక బొమ్మల పంపిణీ!
Kanigiri: కనిగిరి 18వ వార్డులో హెచ్‌ఎమ్‌టీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన పులి శాంతి.
Kanigiri: కనిగిరిలో హెచ్‌ఎమ్‌టీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయక బొమ్మల పంపిణీ!
Kanigiri: వినాయక చవితి సందర్భంగా హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని 18వ వార్డు సుభాష్ రోడ్డులో మట్టి వినాయక బొమ్మల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మట్టి వినాయక బొమ్మలను పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
మాజీ కేంద్రమంత్రి పులి వెంకట్ రెడ్డి మనవరాలు పులి శాంతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వాటిలోని రసాయనాలు చెరువులు, నదులు, కాలువల్లో కలసి నీటిని కలుషితం చేసే అవకాశం ఉందన్నారు.
కృత్రిమ రంగులు, రసాయనాల అవశేషాలు నీటి నాణ్యతను దెబ్బతీయడంతో పాటు నేలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. కొన్ని రసాయనాల వల్ల చర్మం, కళ్లకు, శ్వాసకోశానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నారు. పర్యావరణ హితమైన మట్టి వినాయకులను వినియోగించడం ద్వారా ప్రకృతిని కాపాడటంతో పాటు భావితరాలకు పర్యావరణ పరిరక్షణపై మంచి సందేశాన్ని అందించవచ్చని పులి శాంతి పేర్కొన్నారు.




