Nellore: కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
Nellore: భూ వివాదాల పరిష్కారంలో ప్రతిభ కనబర్చిన కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు అభినందించి రాష్ట్రస్థాయి నోడల్ అధికారిగా నియమించారు.
Nellore
Nellore: గత రెండు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను అభినందించారు. భూ వివాదాల పరిష్కారంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ సమర్థతను గుర్తించి రాష్ట్రస్థాయి ప్రత్యేక నోడల్ అధికారిగా నియమించారు.
ఈ నేపథ్యంలో..నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది.. భూ వివాదాల పరిష్కారంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ నెంబర్ వన్ అంటూ..
కలెక్టర్ల సదస్సులో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.
కలెక్టర్ సమర్థతను గుర్తించి రాష్ట్రస్థాయి ప్రత్యేక నోడల్ అధికారిగా నియమించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. లిటిగేషన్ లేకుండా భూవివాదాలను, పరిష్కరించడంలో, ల్యాండ్ డిస్ప్యూట్ రిజాల్వ్ చేసే విభాగంలోనూ రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్లాను ముఖ్యమంత్రి అభినందించారు.
బెస్ట్ ప్రాక్టీసెస్ లో ఎంపికైన తొమ్మిది విభాగాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం లభించడం సంతోషంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా... సమర్థ పరిపాలన, వేగవంతమైన పరిష్కారం, ప్రజల నమ్మకమే మా బలం అన్నారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.




