Udayagiri: సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు!

Udayagiri: ఈనెల 29న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. రామాపురంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఆనం, నారాయణ, కలెక్టర్, ఎస్పీ.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 21 Sept 2026 10:02 PM IST
Udayagiri
X

Udayagiri: సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు!

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ఈనెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే జీ రామ్ జీ పల్లెపండుగ కార్యక్రమం నేపథ్యంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

పర్యటన ఖరారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సోమవారం మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల రామాపురంలో ఏర్పాట్లను పరిశీలించారు.

హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అనంతరం కోకూరువారిపల్లిలో సీఎం ప్రారంభించనున్న గోశాల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సభా ప్రాంగణం వద్ద అధికారులు, టీడీపీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులు స్పష్టం చేశారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI