Nellore: సీఎం పర్యటన సక్సెస్.. అందరికీ కలెక్టర్ అభినందనలు!

Nellore: సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన విజయవంతం కావడంపై కలెక్టర్ హిమాన్షు శుక్లా హర్షం వ్యక్తం చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 20 May 2026 10:10 AM IST
Nellore
X

Nellore: సీఎం పర్యటన సక్సెస్.. అందరికీ కలెక్టర్ అభినందనలు!

నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు విభాగం సిబ్బంది, మీడియా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయడంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి తుమ్మలపెంట పర్యటన సజావుగా పూర్తయిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను విస్తృతంగా చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే ఉత్సాహం, నిబద్ధతతో భవిష్యత్‌లో కూడా అత్యంత ప్రముఖులు, ప్రముఖుల పర్యటనలను, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story