Nellore: నెల్లూరు జిల్లాను దేశంలోనే నెంబర్ వన్‌గా మారుస్తాం.. సీఎం

Nellore: నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 2 July 2026 8:32 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాను దేశంలోనే నెంబర్ వన్‌గా మారుస్తాం.. సీఎం

Nellore: విశాఖ, అమరావతి, తిరుపతి మూడు రీజియనల్ గా అభివృద్ది చేసి, దేశంలోనే నెంబరు వన్ జిల్లాగా నెల్లూరు జిల్లాను మారస్తానని భరోసా ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ..

రామాయంపట్నం, దుగ్గరాజపట్నం పోర్టులతో జిల్లా రూపు రేఖలు మారతున్నాయని చెప్పారు. గూడూరు, చిల్లకూరు, కోట మండలాల్లో, 27బారీ పరిశ్రమాలు రాబోతున్నాయని చెప్పారు. శ్రీ సిటీ దేశంలోనే ఆదర్శం అని, 25.5 శాతం పెట్టుబడులు, దేశంలోని మన రాష్ట్రానికి. వచ్చాయని తెలిపారు. ఒకప్పుడు పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళి పోయాయని అన్నారు.

రైల్వే లైన్లు త్వరలోనే అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేస్తామని చెప్పారు. సాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే24 వేల కొట్లుఖర్చుపెట్టామని చెప్పారు.జిల్లాలో మెట్ట భూములకు సాగునీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. రూ. 900కోట్లు పునరావాసానికి నిధులిచ్చామని చెప్పారు.

వెలుగొండ ప్రాజెక్ట్, పెన్నా, సర్వేపల్లి, రిజర్వాయర్ లు కూడా , ఈ ఎడాది లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి, కృష్ణా, ఆల్మట్టికి నీరు రాలేదని, ప్రకృతి అనుకూలించాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నదులు, భవిష్యత్ లో అనుసంధానం చేసి తీరుతామని చెప్పారు .

మీ ఇల్లే కరెంటు ఉత్పాదక కేంద్రంగా భవిష్యత్తులో మారుతోందని, ఇతనాల్ తో వాహనాలు నడుస్తాయని చెప్పారు . దేశానికి నేనేం ఇచ్చాను అన్న ఆలోచన వస్తే దేశం తిరుగులేని శక్తిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హీరో మోటార్ కార్స్ ప్రపంచంలోనే కేంద్రం, ఆటో పార్ట్స్ తయారీ గా మారుతోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. గొడ్డలి పార్టీ అవును అంటే ఇకపై అదే పేరుతో పిలవాలని , ప్రతిపక్ష వైసిపికి కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story