Nellore: వైసీపీపై నిప్పులు చెరిగిన సీఎం.. గొడ్డలి పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు!

Nellore: నెల్లూరు గూడూరు నియోజకవర్గంలో పర్యటించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై (YCP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

V. Narasimhulu, Nellore
Published on: 2 July 2026 8:27 AM IST
Nellore
X

Nellore: వైసీపీపై నిప్పులు చెరిగిన సీఎం.. గొడ్డలి పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు!

Nellore: రాష్ట్రంలో అభివృద్ధి కి గొడ్డలి పార్టీ అడ్డుగా వుందంటూ పరోక్షంగా ప్రతిపక్ష వైసిపి పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు... నేడు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం లోని పునరపు పాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..

కొన్ని విప్లవ పార్టీలు హెచ్చరికలు ఎదుర్కొన్నానని, తిరుపతి లో 23 క్లోమోర్ మైన్స్ ప్రయోగిస్తే శ్రీవారు రక్షించారని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం గంజాయి హబ్ గా మారిందని, డ్రగ్స్ కి పిల్లలు అడిక్ట్ అయ్యారని, అలాంటి గంజాయిని నిర్మూలించామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కి చేయూతనివ్వండని పిలుపునిచ్చారు.

రాజధాని అవసరమా లేదా..?అని ప్రజాభిప్రాయాన్ని కోరానని, గొడ్డలి పార్టీకి రాజధాని వద్దంటుంటున్నారని, రాజధాని కి అడ్డంకులు సృష్టిస్తున్నారని, బాబాయ్ ని గొడ్డలి తో చంపి ఆ నెపం తమపై మోపుతున్నారని విమర్శలు చేశారు.

హైదరాబాద్ ను తానే డెవలప్ చేశానని, ప్రతీ రాష్ట్రానికి రాజధాని ఉందని, కానీ ఎపికి లేదని,రాజధాని పై విషాన్ని కక్కుతున్నారని అన్నారు.. ఇప్పుడు మావిగన్ అంటున్నారని, రాజధాని పై రౌడీ లతో దండయాత్ర చేస్తున్నారని, విజయవాడ లో వ్యక్తి మిస్ అయ్యారని, దానిపై సిట్ వేశానని చెప్పారు. పోలీసులు,

డిప్యూటీ సిఎంపై, వైసీపీ కులం కార్డుతో ఆరోపణలు చేస్తోందని, చివరకు పవన్ కళ్యాణ్ కుమార్తె పై అసభ్య కరమైన పోస్ట్ లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లోమోర్ మైన్స్ దాడిలో బాధపడలేదని, అసెంబ్లీ లో భార్యను దూషిస్తే సహించలేక కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తు చేశారు.

ఏపీలో ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరిరోజు అవుతుందని, హోమ్ మినిస్టర్ పై అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టారని, గొడ్డలి పార్టీ పై మా పార్టీ వ్యక్తి పోస్ట్ లు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి యజ్ఞం లా కష్టపడుతున్నామని, రాజకీయ జీవితంలో నేర చరిత్ర కలిగిన గొడ్డలి పార్టీని, నడుపుతున్న వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నానని అన్నారు.

ఏపీ ని దేశం లో మొట్టమొదటి స్థానంలో నిలపాల్లన్నదే తన లక్ష్యం అని, ఏపీలో గొడ్డలిపార్టీ చివరికి హోమ్ మినిస్టర్ పై నే అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టారని, రానున్న 25 ఏళ్ళు NDA గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.గుజరాత్ లో ఒకే పార్టీ అధికారం లో ఉండడంతో అక్కడ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story