Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం!
Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నడ్డా.
Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం!
Nellore: ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్), నెల్లూరులో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ (CCB) ను ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. కె. మాధవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డా వర్చువల్ విధానంలో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించనున్నారని తెలిపారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్‌లో 50 పడకల సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు.
క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అవసరమైన రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని డా. మాధవి తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఈ బ్లాక్ ద్వారా నెల్లూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొననున్నారన్నారు.




