Nellore: సర్వేపల్లిలో రూ.9.30 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ లబ్ధి!

Nellore: సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని 50 మంది బాధితులకు రూ.46 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Sept 2026 1:04 PM IST
Nellore
X

Nellore: సర్వేపల్లిలో రూ.9.30 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ లబ్ధి!

Nellore: నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గురువారం 50 మందికి రూ.46 లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందించడం జరిగింది . అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను పేరుపేరునా సోమిరెడ్డి పలకరించి ఆరోగ్యంపై వాకబు చేయడంతో పాటు యోగక్షేమాలు తెలుసుకున్నరు ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ

ఈ రోజు 50 మందికి రూ.46 లక్షల విలువైన చెక్కులు అందజేయడం చాలా ఆనందంగా ఉందని,కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద సాయం అందించే ప్రక్రియ మొదలైందని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రెండున్నరేళ్లలో 1041 మందికి రూ.9.30 కోట్లు అందించామని అన్నారు.

ఇంత ఉదారంగా గతంలో ఎప్పుడూ పేదలకు సీఎంఆర్ఎఫ్ సాయం అందలేదని,ఎన్ని దరఖాస్తులు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దమనస్సు చేసుకుని సాయం అందిస్తున్నారని అన్నారు.

ఇంకా వందల దరఖాస్తులు ప్రాసెసింగ్ లో ఉన్నాయని వాటిని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ రోజు కొందరికి రూ.4 లక్షలు, రూ.3.56 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున కూడా ఆర్థికసాయం చెక్కులు వచ్చాయని ఆయన అన్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం అందిస్తూనే మరోవైపు వైద్య రంగాన్ని కూడా ప్రభుత్వం బలోపేతం చేస్తోందని,

పేదలకు ఎంతో ఉదారంగా సాయం అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడికి మేమంతా రుణపడివున్నామనిఅన్నారు. ఈరోజు చెక్కులు అందుకున్న వారందరూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరియు సీఎం నారా చంద్రబాబునాయుడు కి ఆనందం వ్యక్తం చేస్తూ జేజేలు పలికారు నిరుపేదలు హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఎన్నో అప్పులు చేసి పొలాలు సైతం అమ్ముకొని ఇబ్బందులు పడుతున్న వారందరికీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మంది కుటుంబాలను నిలబెట్టాయని బాధ్యతలు తెలిపారు సీఎం రిలీఫ్ ఫండ్ అందకపోతే మేమంతా ఇల్లు వాకిళ్లు అమ్ముకొని రోడ్డును పడే వాళ్ళమని ఈ రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు ఎంతో సహాయం అందిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వరిగొండ విజయ డైరీ డైరెక్టర్ చిన్న బాబిరెడ్డి మరియు ముత్తుకూరు మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్,ఈదూరు రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి పెద్ద బాబిరెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్