Nellore: ఏసీఎస్సార్ జీజీహెచ్ అభివృద్ధిపై కలెక్టర్ హిమాన్షు శుక్లా సమీక్ష!
Nellore: నెల్లూరు ఏసీఎస్సార్ జీజీహెచ్‌లో ఐసీయూ, పాలిట్రామా యూనిట్ల ఆధునికీకరణపై కలెక్టర్ హిమాన్షు శుక్లా సమీక్షించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Nellore: ఏసీఎస్సార్ జీజీహెచ్ అభివృద్ధిపై కలెక్టర్ హిమాన్షు శుక్లా సమీక్ష!
నెల్లూరు: ఈ రోజు కలెక్టర్ అధ్యక్షతన ఏసీస్సార్ జీజీహెచ్ అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల , ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మాధవి, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాలిట్రామా యూనిట్ మరియు మెడికల్ ఐసీయూ ఆధునికీకరణకు సంబంధించిన అంశాలను సూపరింటెండెంట్ డా. మాధవి, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విభాగాలను మరింత ఆధునికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక వసతులు, అదనపు సిబ్బంది నియామకాలకు సంబంధించిన అవసరాలను వివరించారు.
ఈ అంశాలపై స్పందించిన కలెక్టర్ , ఎమర్జెన్సీ ట్రామా కేర్ యూనిట్ మరియు మెడికల్ ఐసీయూ అభివృద్ధికి అవసరమైన పరికరాలు సమకూర్చడం, సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయడం వంటి అంశాలపై సూపరింటెండెంట్ డా. మాధవికి తగిన దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రధానంగా పేద మరియు సామాన్య ప్రజలు వైద్యం కోసం వస్తారని, వారికి అంకితభావంతో, మానవతా దృక్పథంతో నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి వైద్యుడిపైనా ఉందని కలెక్టర్ హిమాన్షు శుక్లా వైద్యులకు సూచించారు.
రోగుల పట్ల బాధ్యత, సేవాభావం, సమన్వయంతో పనిచేయడం ద్వారా ఏసీస్సార్ జీజీహెచ్‌ను మరింత మెరుగైన వైద్య సేవలందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.




