Nellore: కిమ్స్ హాస్పిటల్స్.. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం
Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మొక్కలు నాటే కార్యక్రమం. ఎండల తీవ్రత, వడదెబ్బ మరణాలపై నగర కమిషనర్ వై.ఓ. ఆనంద్ ఆందోళన.
Nellore: కిమ్స్ హాస్పిటల్స్.. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం
Nellore: కిమ్స్ హాస్పిటల్స్, వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ వై ఓ ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ వై.ఓ నందన్ మాట్లాడుతూ
ప్రస్తుత పరిస్థితులను మనం చూస్తున్నట్లయితే.. ప్రతి ఏడాది ఎండ తీవ్రత పెరుగుతూనే ఉందని, కొన్ని వందల మంది వడదెబ్బ తగిలి చనిపోవడం మనం చూస్తూనే ఉన్నామని చెప్పారు . మొన్న ఒక్క రోజుల్లోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి, దాదాపు 60 మందికి పైగా వడదెబ్బకు చనిపోవడం అంటే... ఎండ తీవ్రత ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు... ఈ వడదెబ్బకు కారణమేంటి మనం ఆలోచించినట్లయితే మనం క్రమేపి, మన సౌలభ్యం కోసం మనం చెట్లు నరుక్కుంటూనే పోతున్నాం... ఒక విధంగా చెప్పాలంటే పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్ లాగా మారిపోయాయని చెప్పారు.
మనం మన భావితరాలని దృష్టిలో పెట్టుకుని అయినా.. మనం చెట్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని.... ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడమే కాదు...రకరకాల జబ్బులు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు , గుండె జబ్బులు వంటిని కూడా నిరోధించగలిగే శక్తి పచ్చని చెట్టుకు ఉందని.. కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి మనకు కావలసిన ఆక్సిజన్ అందించే ప్రకృతి అందించిన అద్భుతమైన వరం చెట్టు అని అన్నారు .అలాంటి చెట్లను వీలైనంతవరకు మన పరిసర ప్రాంతాల్లోనూ... కామన్ ప్లేసెస్ లోనూ పెంచేలా కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకుని మనం స్వీకరించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో డాక్టర్ సి ఎస్ శ్రీనివాసరాజు, డాక్టర్ సాహెబ్ పీర్, డాక్టర్ మోహన సాయి రూప, డాక్టర్ రేఖ రెడ్డి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రోహిణి ప్రియ లక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.




