Atmakur: ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ షకీలా రెడ్డికి అభినందనలు!

Atmakur: ఆత్మకూరు నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా రెడ్డిని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్మయి గురువారం కలిసి అభినందించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 26 Nov 2026 10:11 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ షకీలా రెడ్డికి అభినందనలు!

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన చైర్‌ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసేవలో నూతన బాధ్యతలు చేపట్టిన షకీలా రెడ్డికి వివిధ వర్గాల ప్రముఖులు,అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా గురువారం ఆత్మకూరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్మయి తన సిబ్బందితో కలిసి నూతన చైర్‌ పర్సన్ డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్ కిరణ్మయి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆమెకు విజయం కలగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, ప్రజారోగ్య పరిరక్షణ వంటి అంశాల్లో మున్సిపాలిటీ, ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ కిరణ్మయి, ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మకూరులోని అధికారిక, ప్రజాసేవా వర్గాల్లో ప్రత్యేకంగా నిలిచింది.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)