Nellore: బూదనం గ్రామంలో పోలీసుల మెరుపు దాడి.. 14 బైకులు సీజ్, 27 మంది గుర్తింపు!

Nellore: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం గ్రామంలో పోలీసులు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 May 2026 4:23 PM IST
Nellore
X

Nellore: బూదనం గ్రామంలో పోలీసుల మెరుపు దాడి.. 14 బైకులు సీజ్, 27 మంది గుర్తింపు!

నెల్లూరు జిల్లా: ​చిల్లకూరు మండలం బూదనం గ్రామంలో పోలీసులు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సరైన పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో ఉంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 27 మంది వ్యక్తుల వేలిముద్రలను సేకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు , ఎస్సై సురేష్ బాబు అక్కడి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమై, నేరాల నియంత్రణ మరియు ముందస్తు రక్షణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story