Nellore: కలిగిరిలో పోలీసుల ‘కార్డన్ అండ్ సెర్చ్’

Nellore: నెల్లూరు జిల్లా కలిగిరిలో భారీ కార్డన్ అండ్ సెర్చ్. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో 170 ఇళ్లలో తనిఖీలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 May 2026 7:09 PM IST
Nellore
X

Nellore: కలిగిరిలో పోలీసుల ‘కార్డన్ అండ్ సెర్చ్’

Nellore: నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని పాతూరు ప్రాంతంలో జిల్లా ఎస్పీ ఈ ఆదేశాల మేరకు, ఈరోజు ఉదయం 05:30 గంటల నుండి 07:30 గంటల వరకు విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.కలిగిరి సీఐ పి.సుబ్బారావు ఆధ్వర్యంలో, కలిగిరి ఎస్‌ఐ వింజమూరు ఎస్ఐ మరియు ఇతర 30 మంది పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 170 ఇళ్లలో ఇంటింటి తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించారు.

సరైన ఆధార పత్రాలు లేని 48 మోటారు వాహనాలు మరియు 1 ఆటోను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అలాగే పాత కేసులలో ముద్దాయిగా ఉన్న ఒక రౌడీ షీటర్‌ను గుర్తించి, పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్చరించి పంపించారు.ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేందుకు ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఆపరేషన్ అనంతరం, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు,

ఆస్తి సంబంధిత నేరాల నివారణ, మహిళల భద్రత, మరియు మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు వివరించి, వాటి నుండి దూరంగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, మత్తు పదార్థాల సరఫరా లేదా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ చర్యల ద్వారా ప్రాంతంలో భద్రతా వ్యవస్థ మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మరికొన్ని ప్రాంతలో ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌ను విస్తృతంగా కొనసాగిస్తామని కలిగిరి సర్కిల్ సీఐ పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story