Nellore: నెల్లూరులో రూ. 761 కోట్లతో మంత్రి నారాయణ అభివృద్ధి జాతర!
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రూ. 761 కోట్ల అభివృద్ధి పనులను పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు.
Nellore: నెల్లూరులో రూ. 761 కోట్లతో మంత్రి నారాయణ అభివృద్ధి జాతర!
నెల్లూరు: మరో రెండేళ్లలో నెల్లూరు నగరంలోని ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన నదీజలాలు. అందిస్తామన్నారు ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ.నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూ.761 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల జాతర ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మీడియా తో మాట్లాడుతూ...రూ.40 కోట్లతో నెల్లూరులో తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగు పెడుతున్నాయని అన్నారు.
కార్పొరేషన్ పరిధి మొత్తం మీద రూ.761 కోట్ల భారీ వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం కాగా,54వ డివిజన్‌లో 350 కిలో లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకు నిర్మాణానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భూమిపూజ చేశారు. అనంతరం 14వ డివిజన్ ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య స్కూల్‌లో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు.నూతనంగా ఏర్పాటు చేసిన క్లాస్ రూం బల్లలపై కూర్చొని నాణ్యతను పరిశీలించారు.విద్యార్థిగా తన గతాన్ని గుర్తుచేసుకున్నారు
చేసుకున్నారు.మంత్రి నారాయణకు స్థానిక ప్రజలు, మహిళలు అడుగడుగు నిరాజనాలు పలికారు.గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి వెళ్లారని ఆరోపించారు.ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారన్నారు.సంపద సృష్టిస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.14,000 కోట్లతో అమృత్ పథకం పనులు జరుగుతున్నాయని, రాబోయే రెండేళ్లలో ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన నదీజలాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే నెల్లూరులోని ప్రభుత్వ హైస్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తున్నామని, వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్లతో విఆర్సీకి దీటుగా మరో ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ నిర్మిస్తున్నామని ప్రకటించారు. వ్యాపార దృక్పథంతో చూస్తే నా పిల్లల నారాయణ విద్యాసంస్థల కోసం ప్రభుత్వ స్కూళ్లను నేను అభివృద్ధి చేయకూడదు.కానీ, పేదరిక నిర్మూలన కేవలం విద్యాభివృద్ధితోనే సాధ్యమని నమ్మి, ప్రతీ పేద విద్యార్థికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు.
పి4 విధానం ద్వారా పేదలకు అండగా ఉంటామని చెబుతూ, స్కూళ్ల డెవలప్‌మెంట్‌కు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్,రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్,కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ.. నెల్లూరు నగర నియోజకవర్గంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా, 54వ డివిజన్‌లో 40 కోట్ల రూపాయల వ్యయంతో 'అమృత్ 2.0' పథకం కింద 350 కేఎల్ సామర్థ్యం గల ఈఎల్ఎస్‌ఆర్ త్రాగునీటి ప్రాజెక్టుకు, 5 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్, 12 కిలోమీటర్ల సబ్ లైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారన్నారు.
అలాగే బాలాజీ నగర్ 14వ డివిజన్‌లోని మల్లెల సంజీవయ్య మెమోరియల్ స్కూల్‌లో అదనపు తరగతి గదులను ప్రారంభించడంతో పాటు, మూలాపేట, ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్స్ వంటి ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యతలను ఆయన కుమార్తె శరణి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు..అంతేకాకుండా, నగరపాలక సంస్థ పరిధిలో 6 నుండి 10వ తరగతి చదువుతున్న మొత్తం 8,400 మంది విద్యార్థులలో 7,000 మంది విద్యార్థులకు మంత్రి నారాయణ తన సొంత నిధులతో త్వరలోనే ఉచితంగా 'హీరో' కంపెనీ సైకిళ్లను పంపిణీ చేయనున్నారన్నారు.
భారతదేశంలోఇలాంటి నాయకుడిని తమ జీవితంలో చూడలేదన్నారు ..పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందించాలనే సంకల్పంతో సొంత నిధులను వెచ్చిస్తూ నారాయణ సార్ చేస్తున్న ఈ సేవలను ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.పదోతరగతిలో 580 మార్కులు సాధించిన మల్లెల సంజీవయ్య స్కూల్ విద్యార్థినులను సన్మానించి మంత్రి నారాయణ అభినందించారు.ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్,అడిషనల్ కమీషనర్ హిమబిందు,మేయర్ సుజాతా అశోక్,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,మాజీ జడ్పిటిసి విజేతా రెడ్డి,54వ డివిజన్ టీడీపీ నేతలు జమీర్,షాహీద్,షాకీర్, తదితరులు పాల్గొన్నారు.




