Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమం!
Nellore: నెల్లూరు 21వ డివిజన్ రామ్ జీ నగర్, ఆదిత్య నగర్ ప్రాంతాల్లో కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో వీధి కుక్కల నియంత్రణ (ABC) కార్యక్రమం నిర్వహించారు.
Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమం!
Nellore: నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ పరిధిలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఈరోజు రామ్ జీ నగర్ మరియు ఆదిత్య నగర్ ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి జంతు జనన నియంత్రణ (Animal Birth Control – ABC) కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
నూతనంగా ఎన్నికైన 21వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి గునుకుల గారి ఆధ్వర్యంలో సంబంధిత మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో భాగంగా వీధి కుక్కలను సురక్షితంగా, మానవీయ పద్ధతిలో పట్టుకుని, పశువైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, స్టెరిలైజేషన్‌తో పాటు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ అందించేలా చర్యలు చేపట్టడం జరిగింది. శస్త్రచికిత్స అనంతరం తగిన వైద్య సంరక్షణ కల్పించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తిరిగి వాటి పరిసర ప్రాంతాల్లో వదిలే విధంగా చర్యలు తీసుకుంటారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే సమస్యలు, విజ్ఞప్తులపై తక్షణమే స్పందిస్తూ డివిజన్‌లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషొర్ గునుకుల,ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు.




