Nellore: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ నేత ఈశ్వర్ నిప్పులు!

Nellore: యూట్యూబ్ ఛానల్ అధినేత ప్రశ్న రావణ్‌పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, జూలై 10న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ

V. Narasimhulu, Nellore
Published on: 7 July 2026 5:48 PM IST
Nellore
X

Nellore: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ నేత ఈశ్వర్ నిప్పులు!

నెల్లూరు: భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం రాజ్యమేలుతోందని, "కార్పోరేట్ సంస్థలకు వరాలు.. సామాన్యుల పైన భారాలు అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతోందని అన్నారు సిపిఐ నేత ఈశ్వర్. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందని, అలాగే పారిశ్రామిక రంగం ధ్వంసం అయిపోయిందని చెప్పారు.

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిపోయి ఇతర మతాలపై దాడులు విచ్చలవిడిగా పెరిగాయని అన్నారు.ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, సిక్కుల యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. అలాగే ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సామాన్యుడు రెండు పూటలా గొడ్డు చాకిరీ చేసినా.పూట గడవని పరిస్థితి నెలకొందని.దానికి తోడుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకానికి మారుపేరుగా కొనసాగుతోందని అన్నారు.. అక్కడ ఎన్డీయే ఇక్కడ ఎన్డీఏ అన్న చందంగా కొనసాగుతుందని చెప్పారు.ఏ సాకు దొరుకుతుందా నిత్యవసర సరుకులు ధరల పెంచుదామా అని ఎన్డీఏ ప్రభుత్వం ఎదురు చూస్తోందని,నరేంద్ర మోడీ పెంచుతున్న ధరలు ఓవైపు ఉంటే, అంతకుమించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ఎక్కువ ధరలు పెంచి.మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాడని చెప్పారు. శాంతి భద్రతలు దేశంలోనూ రాష్ట్రంలోనూ పూర్తిగా లోపించాయని అన్నారు.

ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ అధినేత ప్రశ్న రావణపై గత కొన్ని రోజులుగా వరుసగా పెట్టిన నాలుగు కేసుల్లోనూ.. న్యాయస్థానం ఈ కేసుల్లో పస లేదని బెయిల్ ఇచ్చినప్పటికీ, ఎలాగైనా కక్ష సాధించాలని దురుద్దేశంతో ప్రశ్నా రావణ్ పై దేశద్రోహ కేసు పెట్టి, రిమాండ్ కి తరలించడం దారుణమైన విషయమని అన్నారు.

ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఇతర అన్ని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అన్నీ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించడం అనేది జరిగింది కానీ, రోడ్డు మీదకు వచ్చి వ్యతిరేకించే పరిస్థితి సిపిఐ సిపిఎం కు మాత్రమే ఉందని మిగతా పెద్ద రాజకీయ పార్టీలకు లేదని అన్నారు.బిజెపి ఆనందంగా ఉందని.రావణ్ ని కాబట్టి లోపల వేసాం.రాముడిని వ్యతిరేకించాడు కాబట్టి జైలు ఊచలు లెక్కపెట్టించాం.. అని ఆనందపడుతుందని అన్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ ఇంతకంటే దారుణమైన భాష వాడారని, లోకేష్ కూడా ఇంతకంటే ఎక్కువగానే మాట్లాడాడని, గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గతంలోనూ మాట్లాడారని అన్నారు. వీళ్ళందరూ మాట్లాడిన మాటల్లో లేనటువంటి ఇబ్బంది, రావణ్ మాట్లాడిన భాషలో ఏముందని ప్రశ్నించారు. రావణ్ ని విడుదల చేయాలని కోరుతూ ఈనెల 10వ తేదీ విజయవాడలోని సిపిఎం పార్టీ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ లోపు ప్రభుత్వంలో మార్పు రాకపోతే కాక్రోచ్ లాంటి ఉద్యమం మొదలు పెడతామని లెఫ్ట్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story