Nellore: నెల్లూరు సీపీఐ కార్యాలయంలో ధర్నా కరపత్రం ఆవిష్కరణ!

Nellore: రాజకీయ ఖైదీల విడుదల కోరుతూ ఈ నెల 19న విజయవాడ ధర్నా చౌక్‌లో జరగనున్న ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని నెల్లూరు సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 18 Sept 2026 1:42 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు సీపీఐ కార్యాలయంలో ధర్నా కరపత్రం ఆవిష్కరణ!

Nellore: "రాజకీయ ఖైదీల విడుదల కోరుతూ ఈ నెల 19న విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా - నెల్లూరు CPI కార్యాలయం లో కరపత్రం ఆవిష్కరణ" రాజకీయ ఖైదీల విడుదలను కోరుతూ ఈ నెల 19న విజయవాడ ధర్నా చౌక్ లో జరగనున్న ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని నెల్లూరు లోని CPI కార్యాలయం లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగాCPI జిల్లా కార్యదర్శి అరిగేల సాయి, మరియు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ - దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, న్యాయవాదులు, పర్యావరణ వేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, విప్లవకారులు సుమారు 15 వేల మంది వివిధ జైళ్లలో మగ్గుతున్నారని, వారికి కనీసం బెయిల్ కూడా లభించని పరిస్థితి నెలకొందన్నారు. UAPA వంటి నిర్బంధ చట్టాల కారణంగా న్యాయస్థానాలు సైతం వారికి బెయిల్ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ ధర్నాలో మాజీ పార్లమెంటు సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE