Nellore: దాచూరు దళితులకు సాగు భూములు కేటాయించాలి: సీపీఎం డిమాండ్!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద కండలేరు ముంపు బాధితులు, సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

Madhav Goud, Nellore
Published on: 11 Aug 2026 5:41 PM IST
Nellore
X

Nellore: దాచూరు దళితులకు సాగు భూములు కేటాయించాలి: సీపీఎం డిమాండ్!

నెల్లూరు: నెల్లూరు జిల్లా కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద కండలేరు ముంపు బాధిత దాచూరు గ్రామ దళితులు, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కండలేరు ప్రాజెక్టు ముంపులో దాచూరు గ్రామం మునిగిపోవడంతో ప్రభుత్వం బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ, దళిత కుటుంబాలకు జీవనోపాధి కోసం భూములు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తరతరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు సాగు భూములు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. ముంపులో సర్వస్వం కోల్పోయిన దళితులకు కేవలం ఇంటి స్థలాలు కేటాయించడం సరిపోదని, జీవనోపాధి కోసం సాగు భూమిని కూడా కేటాయించి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పుల్లయ్య, ఆలూరి తిరుపాలు, పెంచిలయ్య, కొండయ్య పాల్గొని బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story