Atmakur: ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ విభాగం పునరుద్ధరణకు డిమాండ్
Atmakur
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు విద్యుత్ శాఖ డిఈ కి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు డేవిడ్ రాజు మాట్లాడుతూ నెల్లూరుపాలెం నందు గల ట్రాన్స్ ఫార్మర్స్ రిపేరు విభాగం మూత పడడం వలన రైతులు- వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని కావున రిపేరి విభాగాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు.
ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 10 మండలాల విద్యుత్ వినియోగదారులకు, రైతులకు విద్యుత్ సప్లయిలో
ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ట్రాన్స్ ఫార్మర్స్ రిపేర్లు వచ్చినా, కాలిపోయినా సకాలంలో ట్రాన్స్ ఫార్మర్స్ ను రిపేరు చేసి తిరిగి రైతుల పొలాల్లో అమర్చే విధంగా ఉండేందుకు నెల్లూరుపాలెం వద్ద ఎస్పిఎం ను గతంలో ఏర్పాటు చేశారన్నారు. అయితే గత 6 నెలల నుండి రిపేర్ విభాగం మూతపడిందన్నారు.. ఈ రిపేరు విభాగం మూతపడి వలన నెల్లూరు రిపేర్ విభాగం నుండి ట్రాన్స్ ఫార్మర్స్ తెచ్చుకోవలసిన స్థితి ఏర్పడినది. రైతులు చెడిపోయిన ట్రాన్స్ ఫార్మర్ ను నెల్లూరుకు తీసుకొని పోయేందుకు డిపార్టుమెంటు వెహికల్ లేనందున రైతులే ఆటో ప్రయాణ ఖర్చులు మరియు కరెంటు ఆఫీసు ఖర్చులు, భోజన ఖర్చులు తదితర ఖర్చులు అన్నీ కలిపి ఒక ట్రాన్స్ ఫార్మర్ తెచ్చుకునేందుకు రైతులకు 7 వేల నుండి
10 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు సుదూర ప్రాంతాల్లో అయితే సీతారాంపురం, వరికుంటపాడు మండలాల
ప్రజలకు రైతులకు ఈ ఖర్చు 10 వేల నుండి 15 వేల వరకు ఖర్చు అవుతుందని. ఇంత ఖర్చులు రైతులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చెడిపోయిన ట్రాన్స్ ఫార్మర్ ప్లేస్ లో వేరొక ట్రాన్స్ ఫార్మర్ పెట్టేందుకు నెలలు సమయం తీసుకుంటున్నారు. ఒక వేళ తెచ్చి బిగించినా వెంటనే కాలిపోతున్నాయి. రిపేర్లులో నాణ్యత లేకపోవడం వలన తరచుగా ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోతున్నాయి. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే దానికి తోడు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ స్థితిలో ట్రాన్స్ ఫార్మర్స్ కొత్తవి-రిపేర్ చేసినవి ప్రతి సెక్షన్ కార్యాలయంలో ఉంచితే రైతులకు అందుబాటులో ఉంటుందని ఖర్చుల భారం తగ్గుతుందని సి.పి.యం పార్టీ తరుపున విజ్ఞప్తి చేశామన్నారు.6 నెలల నుండి ట్రాన్స్ ఫార్మర్స్ రిపేరు విభాగం ఎస్ పి ఎం విభాగం మూతపడి ఉన్నా విద్యుత్ అధికారులు తెరిపించే విధంగా తగిన చర్యలు తీసుకోలేదని రైతులు వినియోగదారుల పట్ల విద్యుత్ అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి వెంటనే నెల్లూరుపాలెం వద్దనున్న రిపేర్ విభాగం యూనిట్ ను అందుబాటులోకి తీసుకురావలెనని CPM పార్టీ ఆత్మకూరు పట్టణ కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు.రైతులకు, వినియోగదారులకు నిరంతరాయం విద్యుత్ సప్లయి చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి విఘాతం కలగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.




