Nellore: రాపూరులో 500 మీటర్ల మేర లైటింగ్ లేక వాహనదారుల అవస్థలు!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు పరిధిలోని NH565 పై 500 మీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
Nellore: రాపూరులో 500 మీటర్ల మేర లైటింగ్ లేక వాహనదారుల అవస్థలు!
నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరులో NH565 మార్గంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా ఆ 500 మీటర్ల పరిధిలో లైటింగ్ సరిగా లేకపోవడంతో, చీకటి పడగానే ఆ ప్రాంతం నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది.
అప్పటిదాకా వెలుగులతో సాగిపోయే ప్రయాణం, ఈ 500 మీటర్ల పరిధిలోకి రాగానే ఒక్కసారిగా చీకట్లోకి జారుకుంటోందని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటులో ఎడతెగని నిర్లక్ష్యం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఆ 500 మీటర్ల పరిధిలో సెంట్రల్ లైటింగ్ సమస్యను పరిష్కరించి ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story




