Nellore: నెల్లూరులో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ సమీక్ష
Nellore: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నెల్లూరులో జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Nellore: నెల్లూరులో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ సమీక్ష
Nellore: నెల్లూరు బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని ఆ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గురువారం నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి వివిధ శాఖల అధికారుల నుంచి జిల్లాలోని బీసీ జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. బీసీలకు సంబంధించిన గణాంకాలు, రికార్డులు, ఇతర సమాచారాన్ని సమగ్రంగా సిద్ధం చేసి కమిషన్‌కు అందజేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకుల నుంచి రాజీవ్ రంజన్ మిశ్రా వారి అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు వివిధ అంశాలపై వినతిపత్రాలను కమిషన్ చైర్మన్‌కు అందజేశారు.
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి అందుతున్న సూచనలు, వినతులను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్, కమిషనర్ నందన్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి, డీపీవో వసుమతి, డీఈవో ఆర్. బాలాజీ రావు, జిల్లాస్థాయి అధికారులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.




