Penchalakona: పెంచలకోనలో బ్రహ్మోత్సవాల సందడి.. నేడు వైభవంగా ధ్వజారోహణం

Penchalakona: నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 April 2026 9:01 PM IST
Penchalakona
X

Penchalakona: పెంచలకోనలో బ్రహ్మోత్సవాల సందడి.. నేడు వైభవంగా ధ్వజారోహణం

Penchalakona: నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన లో అంగరంగ వైభవంగా వారం రోజులపాటు అట్టహాసంగా జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయమంటూ సకల దేవతలను ఆహ్వానించారు ఆలయ అర్చకులు. ముక్తకంఠంతో వేదమంత్రాలు పఠించారు.. పెంచలకోనలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయంలో క్షేత్రోత్సవం నిర్వహించారు.

తెల్లని గుడ్డపై పసుపు, గంధం, చందనాదులు కుంకుమతో ప్రత్యేకంగా తయారు చేసిన గరుత్మంతుడి ప్రతిమను వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ధ్వజస్థంభం పై ఎగురవేసి, సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించిన తిరుచ్చిపై కోలువుదీర్చి ,

ఆలయంలో గిరి ప్రదక్షిణ చేశారు.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో జరిగే ద్వజారోహణనికి ఎంతో విశిష్టత ఉండడంతో.. గరుత్మమంతుడుకి పూజలు, అభిషేకాలకు ఉపయోగించిన ప్రసాదాలను స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం వుండడంతో.. ఇందులో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని కొడిముద్దల కోసం పోటీపడి స్వీకరించడం విశేషం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story