Marripadu: బెడ్చుపల్లిలో రామాలయ నిర్మాణానికి మల్లు శ్రీనివాసులు రెడ్డి విరాళం!

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బెడ్చుపల్లి ఎస్సీ కాలనీ రామాలయ నిర్మాణం కోసం టీడీపీ నాయకులు మల్లు శ్రీనివాసులు రెడ్డి రూ. 25 వేల విరాళాన్ని అందజేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 22 Jun 2026 8:18 AM IST
Marripadu
X

Marripadu: బెడ్చుపల్లిలో రామాలయ నిర్మాణానికి మల్లు శ్రీనివాసులు రెడ్డి విరాళం!

నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం కంప సముద్రం పంచాయతీ పరిధిలోని బెడ్చుపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో రామాలయ నిర్మాణం కోసం మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లు శ్రీనివాసులు రెడ్డి రూ.25,000 నగదును విరాళంగా అందజేశారు.కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ నగదును కాలనీ పెద్దలకు అందజేశారు.

ఈ సందర్భంగా మల్లు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, "ఎస్సీ కాలనీవాసులు రామాలయ నిర్మాణానికి సహాయం కోరగానే స్పందించడం నాకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా పంచాయతీ అభివృద్ధికి, గ్రామ ప్రజల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తాను. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తోడ్పాటు అందిస్తాను" అని హామీ ఇచ్చారు.

శ్రీనివాసులు రెడ్డి చేసిన సహాయానికి కాలనీవాసులు, గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story