Kovur: కోవూరు నియోజకవర్గంలో గడపగడపకూ వేమిరెడ్డి అర్జున్ రెడ్డి

Kovur: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు డాక్టర్ అర్జున్ రెడ్డి పడుగుపాడు గ్రామంలో పర్యటించారు.

V. Narasimhulu, Nellore
Published on: 25 April 2026 9:12 PM IST
Kovur
X

Kovur: కోవూరు నియోజకవర్గంలో గడపగడపకూ వేమిరెడ్డి అర్జున్ రెడ్డి

Kovur: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కోవూరు నియోజకవర్గ పరిధిలోని పడుగుపాడు గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పడుగుపాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా అర్జున్ రెడ్డి పడుగుపాడు పంచాయతీలోని 11, 12, 13 వార్డులలో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడారు. స్థానికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తన తల్లి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు నగరానికి అతి సమీపంలో ఉన్న పడుగుపాడు గ్రామాన్ని అన్ని వసతులతో కూడిన సెమీ అర్బన్ ఏరియాగా అభివృద్ధి చేస్తామని అర్జున్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కోవూరు మండల టీడీపీ ముఖ్య నాయకులు, పడుగుపాడు గ్రామ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story