Atmakur: ఆత్మకూరు మొహర్రం ఉత్సవాలకు డాక్టర్ ప్రణీత్ ఆర్థిక సహాయం
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎల్.ఆర్. పల్లి పీర్ల చావిడి మొహర్రం వేడుకలకు డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.పూర్తి వివరాలు ఇక్కడ.
Atmakur: ఆత్మకూరు మొహర్రం ఉత్సవాలకు డాక్టర్ ప్రణీత్ ఆర్థిక సహాయం
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఎల్.ఆర్. పల్లి పీర్ల చావిడి వద్ద నిర్వహించనున్న మొహర్రం వేడుకల విజయవంతానికి డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధినేత,SVP ప్రజావైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ 20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
బుధవారం తన చాంబర్లో మొహర్రం వేడుకల నిర్వాహకులకు రూ.20 వేల నగదు అందజేసిన డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మత సామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు విజయవంతం కావాలని కోరుకున్నానాని చెప్పారు ఈ సందర్భంగా ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్కి మొహర్రం వేడుకల నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Next Story




