Nellore: వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడిగా డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి!

Nellore: నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడిగా డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి నియామకం. జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యమని వెల్లడి.

Yellayya, Nellore
Published on: 13 Aug 2026 10:53 PM IST
Nellore
X

Nellore: వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడిగా డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి!

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో కీలక నియామకం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిగా డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి నియామకమయ్యారు.

పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ​నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రేవంత్ చక్రవర్తికి బాధ్యతలు అప్పగించడం ద్వారా యువతలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకత్వం అడుగులు వేస్తోంది. ఎమ్మెల్సీ మేరిగ మురళిధర్ అందించిన సేవలు, పార్టీ కోసం ఆయన చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని ఆయన తనయుడు డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తికి ఈ పదవిని కేటాయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

​నియామకం పట్ల డాక్టర్ రేవంత్ చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా సైనికులా కష్టపడతానని ఆయన స్పష్టం చేశారు. ​ఈ యువ నాయకుడి నియామకం పట్ల ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, పార్టీ శ్రేణులు, నాయకులు ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు. రాబోయే కాలంలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన తన వంతు పాత్ర పోషిస్తారని ఆకాంక్షించారు.

Yellayya, Nellore

Yellayya, Nellore

Next Story