Somasila: సోమశిల జలాశయం చెంతనే దాహం కేకలు.. ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
Somasila: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో తాగునీటి ఎద్దడిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Somasila: సోమశిల జలాశయం చెంతనే దాహం కేకలు.. ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
నెల్లూరు జిల్లా: అనంతసాగరం మండలంలోని సోమశిల గ్రామంలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కొద్దిరోజులుగా గ్రామంలో తాగునీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోయారు. పక్కనే పెన్నా నది ప్రక్కనే ఉన్న నీటి కష్టాలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తాగునీటి రంగానికి జిల్లాకె తలమానికమైన సోమశిల జలాశయం ఉన్న గ్రామంలో తాగునీటికి నానా తంటాలు పడుతున్నామని సంబంధిత అధికారులు తమ సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఎండలు కాస్తున్న నేపథ్యంలో తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు సక్రమంగా తాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story




