Sarvepalli: ముత్తుకూరు నూతన ఎంపీపీగా ఈదూరు రామ్మోహన్ రెడ్డి ఏకగ్రీవం!
Sarvepalli: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు 9 టీడీపీ గెలుచుకోగా, గురువారం ఎంపీపీగా ఈదూరు రామ్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Sarvepalli: ముత్తుకూరు నూతన ఎంపీపీగా ఈదూరు రామ్మోహన్ రెడ్డి ఏకగ్రీవం!
నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం నూతన ఎంపీపీగా ఈదూరు రామ్మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా బాణాసంచా నడుమ ప్రమాణ స్వీకారం చేశారు. ముత్తుకూరు మండలంలో 17 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 9 సెగ్మెంట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దీంతో సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈదూరు రామ్మోహన్ రెడ్డి మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది.
అలాగే మండల ఉపాధ్యక్షురాలుగా బసవంగారి పోలమ్మను ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకొని ఘనంగా పూలమాలతో శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు ఈదూరు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎంపీటీసీలకు తెలుగుదేశం నాయకులకు తమ గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు




