Atmakur: ఆత్మకూరు బస్టాండ్‌లో ఘోరం ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ ప్రాంగణంలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు సుబ్బారెడ్డి (86) దుర్మరణం. బస్సు డ్రైవర్ అదుపులోకి.
Atmakur: ఆత్మకూరు బస్టాండ్‌లో ఘోరం ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు మలుపు తిప్పే క్రమంలో ఓ వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పట్టణంలోని నాగేంద్రపురానికి చెందిన చలమల సుబ్బారెడ్డి అనే 86 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ఆపకుండా వెళ్ళిపోయింది.
దీంతో మృతుడు సుబ్బారెడ్డి బంధువులు బస్టాండ్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు స్పందించి వారిని నచ్చజెప్పడంతో ఆందోళనలు విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రైవేటు అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి AP07Z0535 నంబర్ గల సోమశిల వెళ్ళే ఆర్టీసీ బస్సు అని గుర్తించి సయ్యద్.కరిముల్లా అనే డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.




