Naidupeta: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి కిలివేటి సంజీవయ్య!
Naidupeta: నాయుడుపేటలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టారు.
Naidupeta: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి కిలివేటి సంజీవయ్య!
Naidupeta: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచనల మేరకు, మాజీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య గారి ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం మొదటి రోజు ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగాయి.
ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడినట్లేనని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి వారి భవిష్యత్తును కాపాడాలని కోరారు.
రిలే నిరాహార దీక్షలలో భాగంగా మొదటి రోజు తడ మండల నాయకులు దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షా శిబిరం వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.
సాయంత్రం మాజీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య దీక్షలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు నిమ్మరసం అందించి తొలి రోజు రిలే నిరాహార దీక్షను విరమింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలను విస్మరిస్తూ ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకు సాగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ అబ్జర్వర్ బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి , వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి , పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి , నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి ఎస్.ఈ.సీ సభ్యులు దబ్బల శ్రీమంత రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి వేణు యాదవ్ , ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి ,
నాయుడుపేట మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కటకం దీపిక , తడ మండల అధ్యక్షులు ఆర్ముగం దొరవారిసత్రం మండల అధ్యక్షులు అల్లూరు రాహుల్ రెడ్డి , వేణుంబాక మునుస్వామి నాయుడు, సన్నం ప్రిస్కిల్లా ఒగ్గు వెంకటరత్నం , జలదంక వెంకటకృష్ణారెడ్డి , చదలవాడ కుమార్ , అలవల సురేష్ మమత , తేజ రెడ్డి , పేర్నాటి రాహుల్ , రాయపు శేఖర్ , నెలవల రవి , ఈదా రత్నశ్రీ , పాలేటి నాగార్జున , షబ్బీర్ , వరకళా చంద్రా , లక్ష్మీ ప్రసన్నకుమార్ రెడ్డి , రమేష్ రెడ్డి , మాజీ కౌన్సిలర్లు సరిత, సునీల్ , కన్మాని , తిరుమల రెడ్డి, మురుగన్ రెడ్డి, మహేశ్వర్, శివ కుమార్, రాజ్ కుమార్, జేడీ రాజు, అఫ్రిది, గుణ, ప్రకాష్, దేవ కుమార్, గిరీష్, మురళి తదితరులు పాల్గొన్నారు.




