Gollapalli: ఆత్మకూరు రాజకీయాల్లో వేడెక్కిన ‘గొల్లపల్లి’ ఘటన
Gollapalli: గొల్లపల్లిలో దాడికి గురైన వైఎస్సార్సీపీ బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.
Gollapalli: ఆత్మకూరు రాజకీయాల్లో వేడెక్కిన ‘గొల్లపల్లి’ ఘటన
Gollapalli: ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు, వేధింపులు, దాడులు అధికమయ్యాయని, ప్రతి కార్యకర్తకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గొల్లపల్లి గ్రామంలో భూతాగాదాల నేపధ్యంలో టీడీపీ నాయకుడు దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నాయకులు ఈగా నరసారెడ్డి,
ఈగా లక్ష్మిదేవమ్మలను, వారి కుటుంబసభ్యులను బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి భూతగాదాకు సంబంధించిన పూర్తి వివరాలను బాధిత వైఎస్సార్సీపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలిసులు చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు.
Next Story




