Nellore: నా కుమారుడి పెళ్లిని అడ్డుకోవడానికే ఈ నిందలు.. పరువు నష్టం దావా వేస్తా!
Nellore: కృష్ణాపురం బీచ్ వద్ద అక్రమ లేఅవుట్ వేస్తున్నారన్న ఆరోపణలను మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఖండించారు.
Nellore: నా కుమారుడి పెళ్లిని అడ్డుకోవడానికే ఈ నిందలు.. పరువు నష్టం దావా వేస్తా!
Nellore: కృష్ణాపురం బీచ్ లో అక్రమంగా లే ఔట్ వేస్తున్నారని మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై స్పందించారు మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్.
ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారని, నిజానిజాలు తెలుసుకుని చేసి ఉంటే బాగుండేదని అన్నారు..
90 ఎకరాల భూమి లీగల్ పట్టా వుందని.. ఎక్కడ కబ్జా జరిగిందో చెప్పమని ప్రశ్నించారు ద్వారకా నాథ్..
రాజకీయాల్లో మా డబ్బులు పోగొట్టుకున్నామే తప్ప ఎక్కడా దోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు...
అక్కడ రిసార్ట్ కట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ భూమిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేశామని, ఇందులో అక్రమాలకు రహస్యాలకు తావు లేదని చెప్పారు.. జిల్లాలో టూరిజం వ్యవస్థని పెంచుకోవాలని 50 ఎకరాలు ఆడిగామని, మొత్తం 90 ఎకరాలు ఇస్తామని చెప్పడంతో మొత్తం కొనుక్కున్నామని చెప్పారు..
నుడా నిబంధనలతో అక్కడ లే ఔట్ వేసుకున్నామని ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదో చెప్పాలని అన్నారు..
ఈ భూమి విషయంలో ప్రశాంతిరెడ్డి గారికి ఏం సంబంధమో.. అర్థం కావట్లేదు అని అన్నారు..
అక్కడ రిసార్ట్ పెట్టాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో తాము కలిసి మాట్లాడామని, నిబంధనలు పాటించి రిసార్ట్ కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆమె చెప్పారని తెలిపారు..
46 ఎకరాలు లే ఔట్, 44 ఎకరాల్లో రిసార్ట్ అనుకున్నామని, సముద్ర తీరంలో రిసార్ట్ కట్టాలి అంటే అనేక అనుమతులు కావాలి కాబట్టి, 5 నెలలుగా తిరిగి అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు ద్వారకానాథ్.
సీఆర్ జెడ్, టూరిజం శాఖ నుంచి కూడా అనుమతులు తీస్కున్నామని, మా ప్రాజెక్టు ని అడ్డుకోవాలి అని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
12 వ తేదీ తన కుమారుడి పెళ్లి రిసార్ట్ ప్రాంగణంలోనే పెట్టుకున్నామని, కావాలనే నన్ను, నా కుమారుడి పెళ్లి డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. వీపీఆర్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తిరుగుతుంటే కావాలని నిందలు వేస్తున్నారని చెప్పారు..
ఈ భూముల్లో అరసెంటు భూమి అయినా నేను ఆక్రమించుకున్నానని నిరూపిస్తే.. మొత్తం భూమి వదులుకోవడానికి నేను సిద్ధం అని అన్నారు..
ఈ 90 ఎకరాలు సింగిల్ డాక్యుమెంట్ కాబట్టే ముందుకు దిగామని, ఈ విషయంలో కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తానని, పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పారు ముక్కాల ద్వారకానాథ్.




